పేదోడి నడ్డివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరలు..
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు..
ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు..
తాజాగా ఒక్కో సిలిండర్‌కు రూ.50 పెంపు..
లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు
మంచిర్యాల, మార్చి 23, నమస్తే తెలంగాణ : కొవి డ్-19తో ఆర్థికంగా చితికిపోయిన సామాన్యులు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. ఇంతలోనే కేంద్రం ధరల పిడుగు వేసింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా సామాన్యుల నెత్తిపై బీజేపీ ప్రభుత్వం గుది‘బం డ’ మోపింది. వంటగ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను సైతం ఒక్కసారిగా, ఒకేరోజు పెంచింది. సిలిండర్‌పై రూ.50 పెంచడంతో ధర రూ.వెయ్యి దాటింది. లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెం చింది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటడంతో సామాన్యుడి బతుకు కుదేలవుతున్నది.
ధరలకు రెక్కలు.. కుదేలవుతున్న పేదలు..
కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలతో సామాన్యుడి జీవనం అగమ్యగోచరంగా మారింది. పలు రాష్ర్టాల్లో ఎన్నికల నేపథ్యంలో స్తబ్దంగా ఉన్న ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెంచింది. వంట నూనెల ధరలు లీటర్‌కు రూ.100 పెరిగాయి. ధరలు ఆకాశన్నంటడంతో పేదోడి బతుకు కుదేలవుతున్నది. లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసల చొప్పున ప్రజలపై భారం వేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ధరలను పెంచుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. వంట నూనెల ధరలతో పాటు నిత్యావసరాలు, భవన నిర్మాణ సామగ్రి ధరలు సైతం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య త రగతి ప్రజల ఆర్థిక పరిస్థితి చిన్నాభి న్నం అవుతున్నది. కరోనాతో ఆర్థికంగా చతికిలపడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నా రు.
ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అన్నింటా పెరుగుతున్న ధరలతో సామాన్యు లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సిలిండర్ ధరలు గతేడాది అక్టోబర్ తర్వాత మళ్లీ పెరిగాయి. గత అక్టోబర్‌లో రూ.15 చొప్పున పెరిగిన ధరలు, ఇప్పుడు రూ.50 చొ ప్పున పెరిగాయి. 14.2 కిలోలున్న రాయితీ గ్యాస్ సి లిండర్ ధర డిసెంబర్ 2020లో రూ.746.50 ఉండ గా, ధరలు పెరుగుతూ అది కాస్తా రూ.958.50లకు చేరింది. ప్రస్తుతం పెంచిన రూ.50తో ధర రూ.1,00 8.50కు చేరుకున్నది. జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 2,42,112 ఉన్నాయి. ఒక నెలలో ఒక ఇంట్లో సగటున సిలిండర్ వాడుతుండగా, ధరల పెంపుతో జిల్లా ప్రజలపై రూ.1,21,05, 600 భారం పడుతుంది.