ఆదిలాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో విసుగు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని తాంసి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో సుమారు 250 కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టి అప్పులు చేస్తుంది కానీ అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని కొనియాడారు. అనిల్ జాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.