తాండూర్ : వసంత పంచమి ( Vasant Panchami ) సందర్భంగా తాండూర్, మాదారం సెక్టార్లలోని అంగన్వాడీ సెంటర్లలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసాలు (Mass literacy Programme) , అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.
గోపాల్ నగర్ అంగన్వాడీ సెంటర్లో బెల్లంపల్లి ఏడీఏ రాజనరేందర్, తాండూర్ వ్యవసాయాధికారి కే సుష్మా, సర్పంచ్ గాట్ల నర్సయ్య, సూపర్ వైజర్ రమాదేవి, మాదారం-9 అంగన్వాడీ సెంటర్లో సర్పంచ్ కుష్నపల్లి లక్ష్మణ్, సూపర్వైజర్ స్వరూపారాణి ముఖ్యఅతిథులుగా హాజరై అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నెలల తరువాత పిల్లలకు అదనపు పొష్టికాహారం అందించాలని, పోషణ పారిశుధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత, పోషకాహార లోపం వల్ల కలిగే అనర్ధాలు తల్లులకు వివరించి సంతులిత ఆహారంపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాజుల సునీత, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.