తాండూర్ : సింగరేణి ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ( AITUC ) , ఏఎన్టీయూసీ, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీబీజీకేఎస్ ( TBGKS ) బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు ( Srinivas Rao ) డిమాండ్ చేశారు.
శనివారం బెల్లంపల్లి ఏరియా తాండూర్ మండలం గోలేటి ఏరియా వర్క్ షాప్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఫిట్ కార్యదర్శి గాజవేని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేటు మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసి గెలిచిన తర్వాత కార్మికులు కోల్పోయిన హక్కులను వివరించారు. టీబీజీకేఎస్, కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులు ఎన్నో హక్కులను సాధించుకున్నారని తెలిపారు. ఫలితంగానే సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ హయములో సంతోషంగా ఉండేవారని అన్నారు.
రెండు సంవత్సరాలుగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గాని రాష్ట్ర ప్రభుత్వం గానీ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లాభాల వాటాను తగ్గించడంతోపాటు కేసీఆర్ అమలు అమలు చేసి ఉద్యోగ కారుణ్య నియమకాలను నిలిపివేశారని ఆందోళన వ్యక్తంచేశారు. మెడికల్ బోర్డులను నిర్వహించడం లేదని ఆరోపించారు.
రానున్న సింగరేణి ఎన్నికలలో టీబీజీ కేఎస్ సొంతంగానే పోటీ చేస్తుందని ఎవరితో పొత్తు ఉండదని ఆయన పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో నాయకులు మంగీలాల్, మారిన వెంకటేశ్వర్లు, సెంట్రల్ జాయింట్ సెక్రటరీ ఓరం కిరణ్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సురేష్, స్టోర్ పిట్ సెక్రటరీ గణపతి, నాయకులు రమేష్, వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.