దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి : ఐటీడీఏ పీవో మంద మకరంద
దశల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరంద అన్నారు.
నార్నూర్, మే19 : దశల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరంద అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామంలో జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డులు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ నాయకులు పీవోను కోరారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పిల్లలు ఉన్నత చదువులు అభ్యసిస్తేనే ప్రయోజకులుగా ఎదుగుతారన్నారు.
పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన అంశాలు సమన్వయంతో చర్చించి తీర్మానం చేయాలని, తీర్మానం ప్రణాళికాబద్ధంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలను వందశాతం అమలు చేసిన అధికారులకు బహుమతి ప్రకటిస్తామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న సమస్యలు దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనక సత్యనారాయణ,ఉప సర్పంచ్ విశ్వజిత్, అడిషనల్ డీఎంహెచ్ఓ కుడ్మెత మనోహర్, డీఎల్ పీవో ప్రభాకర్, తాహసిల్దార్ జాడి రాజలింగం, ఎంపీ డీవో పూల్లారావ్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

