మంచిర్యాల, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులు జాతీయ జెండాను తీవ్రంగా అవమానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
సూర్యాస్తమయంలోగా జెండాను దించాల్సి ఉండగా, సిబ్బంది అలాగే వదిలేశారు. జెండా ఎగరేసి మూడు రోజులవుతున్నా దింపక పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పతాకాన్ని అవమానపరచిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.