హాజీపూర్, అక్టోబర్ 25 : ప్రజలకు అన్యా యం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాక ర్ రావు అన్నారు. కొండాపూర్, పెద్దంపేట, బుద్దిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెద్దంపేట గ్రామానికి చెందిన పెంద్రం విజయలక్ష్మి.. శివారులోని సర్వే నంబర్ 22లో గల తన భూమిలోని 3.16 ఎకరాలను పడ్తన్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ రామారావు ఆక్రమించుకున్నాడని, న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరింది. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని పరోక్షంగా హెచ్చరించారు.
రౌడీలు, గుండాలు, భూ కబ్జాదారులకు నియోజకవర్గంలో స్థానం లేదన్నా రు. ప్రజల భూములు ఎవరైనా కబ్జా చేస్తే నేరుగా పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చే యాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారన్నారు. అలాంటి బీఆర్ఎస్కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది కొనసాగాలంటే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రే మ్‌సాగర్‌రావు 2006లో తనపై పోటీ చేయబోన ని ఆయన కొడుకుపైనా, ఇష్ట దైవంపైనా ఒట్టువేశాడన్నారు.
కానీ, పదవి కోసం ఇప్పుడు పోటీకి సిద్ధమయ్యాడని విమర్శించారు. బ్యాంకులకు అ ప్పు ఎగ్గొట్టిన ఘనత ఆయనదేనని ఆరోపించారు. పదవుల కోసం తప్పడు పనుల చేసే వారిని తరిమికొట్టాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, బుద్దిపల్లి సర్పంచ్ అన్నం మధుసూదన్ రెడ్డి, దొనబండ సర్పంచ్ జాడి సత్యం, స్థానిక ఎంపీటీసీ జాడి వెంకటేశ్, కర్నమామిడి పీఏసీఎస్ చైర్మన్ కొట్టె సత్తయ్య, నాయకులు బేతు రవి, అల్లంల నాగయ్య, అంబటయ్య, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 25 : మండలంలోని రంగపేట, హన్మంత్‌పల్లి గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు ఎమ్మెల్యే దివాకర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భం గా తన నివాసంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేసిన, చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు ఆకర్శితులై, నాయకులు, యువకులు పా ర్టీలో చేరుతున్నారన్నారు. గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సు మారు వంద మందికి పైగా పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉప్యాక్షుడు అంకతి రమేశ్, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి అనీల్ రెడ్డి పాల్గొన్నారు.