మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 26 : ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్‌కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిట్లు వెల్లడించారు.
జిల్లాకే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ధాన్యం పంపించామని, త్వరలోనే పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు కూడా ధాన్యం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొన్ని కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట డీఎం కార్యాలయ అధికారి మహిపాల్ సింగ్ తదితరులున్నారు.