హజీపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడికి పూజలతో వైవిధ్యమైన కార్యక్రమాలు.. భక్తిగీతాలతో సందడి చేస్తున్నారు స్థానిక మహిళలు. గుడిపేట్ 13 వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ ముందు ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ మండలిలో గురువారం మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు.
అనంతరం గోరింటాకు, గాజుల వేసుకోవడం కార్యక్రమం నిర్వహించారు. పూజ కార్యక్రమాల సందర్భంగా భక్తి గీతాలు ఆలాపించారు. సెప్టెంబర్ 5 శుక్రవారం నిమజ్జనానానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడకలో కోలాట ఆటతో గణపతిని సాగనంపాలని.. అందుకు అవసరమైన పనుల్లో నిమగ్నం అయ్యామని నిర్వాహకులు తెలిపారు.