మంచిర్యాల: మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో విషాదం చోటుచేసుకున్నది. కొడుకు పుట్టలేదన్న మనస్థాపంతో 9 నెలల చిన్నారితోసహా మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రేండ్లగూడకు చెందిన స్పందన, శ్రవణ్ దంపతులకు నాలుగేండ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయికి 3 ఏండ్లు కాగా, చిన్నా పాపకు 9 నెలల వయస్సు ఉన్నది. అయితే మగ పిల్లాడు పుట్టలేదని గత కొంతకాలంగా స్పందన బాధపడుతున్నది.
ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె తన 9 నెలల పాపతోపాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.