కోటపల్లి, జూలై 15 : మావోయిస్టులు లోగిపోవాలి అని తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టు నేత ఆత్రం లచ్చన్నతో పాటు ఆత్రం అరుణ రామగుండం సీపీ ఎదుట లొంగిపోనున్నారు. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్న ఆత్రం లచ్చన్న స్వస్థలం కోటపల్లి మండలం పారుపల్లి గ్రామం.
బస్తర్లో డివిజన్ కమిటీ సెక్రటక్గా ఉన్న అరుణ స్వస్థలం పెంచికల్ పేట అని తెలుస్తోంది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న లచ్చన్న లొంగిపోవాలని కోటపల్లి పోలీసులు గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాలు నేడు ఫలించాయి. ఈరోజు సాయంత్రం రామగుండం సీపీ ముందు లచ్చన్న, అరుణ లొంగిపోనున్నట్లు సమాచారం.