తాండూర్, ఆగస్టు 11: బెల్లంపల్లి నూతన సబ్ కలెక్టర్(రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ను సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల తుడుందెబ్బ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించడం జరిగింది. తాండూర్ మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటువు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ కొలవార్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండిగ రవీందర్, తాండూర్ మండల అధ్యక్షుడు గోలిశెట్టి బాపు, ఆదివాసీ కొలవార్ సేవా సంఘం జిల్లా నాయకులు యపాల సమ్మయ్య, గడ్డం మణికుమార్ మండల నాయకులు ఊరడి మహేష్, అరికిల శంకర్, టేకం నా జయ్య తదితరులు పాల్గొన్నారు.