మంచిర్యాల : రైతుబంధు పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందజేస్తున్న సీఎం కేసీఆర్పై వివిధ వర్గాల నుంచి ప్రశంసలు వెళ్లువెత్తున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, ఎడ్లబండ్లపై ఊరేగింపులతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
అందులో భాగంగా జిల్లాలోని దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో ఓ యువకుడు సీఎం కేసీఆర్పై ప్రత్యేక అభిమానం చాటుకున్నాడు. తోట పవన్ వర్మ యువకుడు వరి పొలంలో నారుమడితో సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, యువ నాయకుడు, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు పేర్లతో వేస్తూ సంబురాలు చేసుకున్నారు.