కాసిపేట, డిసెంబర్ 4 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని చింతగూడ హాబిటేషన్ లో బడి బయట పిల్లల గుర్తింపుపై దేవాపూర్ విద్యాశాఖ సీఆర్పీ మంతెన రమేష్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో పిల్లలు చదువు ఆపేసిన వారిని గుర్తించి వారి వివరాలను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సీఆర్పీ రమేష్ తెలిపారు.
డ్రాపౌట్ గల కారణాలు, వారి వయస్సు ఆధారంగా వారిని పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలపై వివరాలను సేకరించి అధికారులకు పంపుతామన్నారు. ప్రతి గ్రామంలో సర్వే చేపట్టి వివరాలు నమోదు చేస్తామని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యమన్నారు.