మంచిర్యాల అర్బన్ : షబ్-ఎ-ఖద్ర్-జాగ్ నే కి రాత్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెప్పారు. గురువారం ఆర్ధర్రాత్రి ఆయన మంచిర్యాల పట్టణాన్ని సందర్శించారు. అక్కడ ముస్లిం సోదరులతో మాట్లాడారు. ప్రశాంత మైన వాతావరణంలో పండగలను కలిసి జరుపుకోవాలని, ఒకరినొకరు గౌరవించి, మత సామరస్యాన్ని చాటాలని డీసీపీ సూచించారు.
అనంతరం మంచిర్యాల రైల్వే స్టేషన్ను, పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి విధి నిర్వాహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తడానికి అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని, అట్టి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.