కాసిపేట, అక్టోబర్ 3 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఆదివాసీ గిరిజన సాలేగూడ గ్రామ పటేల్ సిడం జైతు(68) ఆనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గోండు దండారీ పాటల కళాకారులు, ప్రథమ నాటు వైద్యుడిగా, దాతగా సేవలు అందించారు. గ్రామంలో పాఠశాలకు, కమ్యూనిటీ హాల్‌తో పాటు గ్రామంలోకి పలువురి ఇళ్ల నిర్మాణాలకు సైతం భూమిని విరాళంగా అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఆయన అకాల మరణం తీరని లోటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం ఉదయం అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సిడం జైతుకు భార్య సిడం కమలాబాయి, కుమారుడు సిడం మోహన్ ఉన్నారు.