కాసిపేట, జనవరి 13 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాసిపేట మండల కేంద్రానికి చెందిన రత్నం లక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో పోటీ మధ్య బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కాసిపేట మండలానికి దక్కింది. చైర్ పర్సన్ తో పాటు బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రకటించింది. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రత్నం లక్ష్మి, వైస్ చైర్మన్ గా సింగర్సు రవీందర్ రావును నియమించారు. చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మరో 15 మందికి సభ్యులుగా చోటు దక్కింది.
సభ్యులుగా కోమటి శ్రీనివాస్, గోలేటి సంధ్య, కమ్మరి భీమయ్య, టకిరే మల్లేష్, పంజాల శ్రీనివాస్ గౌడ్, బట్టు శ్రీనివాస్, బోరిగం జలపతి, చిన్నోజు శంకరయ్య, ఉత్తూరి సత్తయ్య, నిజాముద్దీన్ మహుమద్, మంచాల రమేష్, బెల్లంపల్లి పీఏసీ స్పెషల్ ఆఫీసర్, జిల్లా మార్కెట్ కమిటీ ఆఫీసర్, బెల్లంపల్లి ఏడీఏ, బెల్లంపల్లి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ను సభ్యులుగా నియమించారు. రెండేళ్ల పాటు వీళ్లు పదవిలో కొనసాగనున్నారు.