కాసిపేట, అక్టోబర్ 16 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి, చిన్న ధర్మారం కాసిపేట గ్రామాల్లో నీటి సమస్యపై బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలో కాసిపేట1 గని ముందు మహిళలు, గ్రామస్తులు, యువకులు ఖాళీ బిందెలతో గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సూరం సంపత్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీలో నీటి సమస్య పై ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా పని కాడవడం లేదన్నారు. గ్రామ పంచాయతీలో నిధులు కొరత, కాంగ్రెస్ ప్రభుత్వం అద్వాన పరిస్థితిలో ఉందన్నారు.
గ్రామాల్లో ఉన్న నాయకులు కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేరని వాపోయారు. కాసిపేట, ముత్యంపల్లి, చిన్న ధర్మారం గ్రామాల్లో భూగర్భ జలాల్లో నీరు లేకపోవడం వల్ల బోరు పడని పరిస్థితి ఉందని, తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సింగరేణి గని అదనపు మేనేజర్ నిఖిల్ అయ్యర్ కు వినతిపత్రం అందించారు. సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి మూడు రోజుల్లో సమస్యను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు బాకి కిరణ్, నగరారపు ప్రసన్న , మహిళలు పోసు, లచ్చక్క, కవిత, పద్మ మహేశ్వరి, లక్ష్మీ, గ్రామ యువకులు మహేష్, శ్రీకాంత్, హనుమంతు, అరవింద్, గ్రామస్తులు బర్ల రామ్మూర్తి, మైదం రవి, సూరం కిషన్, నారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.