తాండూర్, డిసెంబర్ 4: సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్ 7,8,9 తేదీలలో మెదక్ లో జరుగనున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, జిల్లా కమిటీ సభ్యుడు చల్లూరి దేవదాస్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుంది అన్నారు.
ఈ మహాసభలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులకు సాధించిన హక్కులను చర్చించి భవిష్యత్తు మూడు సంవత్సరాలలో సీఐటీయూ చేయబోయే కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి తీర్మానాలు చేయబోతుంది అన్నారు. ఈ మహాసభలలో కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె లీలారాణి, కే విజయలక్ష్మి, రామగిరి వరలక్ష్మి, గడ్డల హనుమక్క, అక్కపెళ్లి కమల, ఇందూరి హనుమక్క, ఊరడి కమల, రాధ, రెడ్డి మల్లక్క, దవన భ్రమరేశ్వరి, ఆనీషా నానయ్య, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.