కాసిపేట, డిసెంబర్ 25 : మన పథకాలు దేశానికే ఆదర్శమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని కొండాపూర్ యాపలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో బెల్లంపల్లిలో నిర్వహించే మంత్రుల సభకు కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, డైరెక్టర్లు ఏనుగు మంజులారెడ్డి, అప్పాల శేఖర్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, చంద్రమౌళి, సర్పంచ్‌లు సపాట్ శంకర్, దరావత్ దేవి, ఆడె జంగు, భూక్యా సునీత, ముత్యాల స్వప్న, సంపత్ నాయక్, బీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, నాయకులు అట్టెపల్లి శ్రీనివాస్, గడ్డం పురుషోత్తం, ఉప సర్పంచ్‌లు బోయిని తిరుపతి, పిట్టల సుమన్, భూక్యా రాంచందర్, దుస్స చందు, బానోత్ రాజేశ్, రాంటెంకి వాస్దేవ్, బింగి శ్రీనివాస్, బందెల ప్రేంకుమార్ పాల్గొన్నారు.