కాసిపేట, ఆగస్టు 2 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మామిడిగూడెం గ్రామంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. గత వారం రెండు డెంగ్యూ కేసులు నమోదు కాగా ప్రస్తుతం వారు కోలుకున్నారు. జ్వరాలు పెరిగే అవకాశం ఉన్న నేపద్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారు.
దీంతో పాటు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీ వైద్య శిబిరాన్ని, శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ మేరకు ఇళ్లలో ఎవరికి వారు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అనిల్, కార్యదర్శి శ్వేత, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, హెచ్ఐవో చంద్రశేఖర్, హెచ్ఏ నారాయణ, ఏఎన్ఎంలు జ్యోతి, రజిని, ఆశాలు, స్థానికులు పాల్గొన్నారు.