మంచిర్యాల టౌన్, డిసెంబర్ 12 : పట్టణంలోని రాంచెరువు స్థలంలో నిర్మిస్తున్న పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్‌గౌడ్, కమిషనర్ బాలకృష్ణతో కలిసి పార్కు పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఎస్ఎఫ్ఐడీసీ నిధులు రూ. 2.30 కోట్లు వెచ్చించి పార్కులో చెరువుకట్ట రివైటింగ్, చెరువు చుట్టూ రెయిలింగ్, విద్యుదీకరణ, పూడిక మట్టి తొలగింపు, తదితర పనులు చేపడుతామన్నారు. పార్కు నిర్మాణంతో పాటు రానున్న రోజుల్లో భారీ వర్షాలు వస్తే రాంచెరువు వరద కాలనీల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాంచెరువులో బోటింగ్ ఏర్పాటుచేసే అవకాశం ఉన్నందున చెరువు నీటిలోకి మురుగునీరు చేరకుండా ఎస్టీపీ ప్లాంట్లను వెంటనే ఏర్పాటు చేయాలని, ఇందుకోసం నిధులను సమకూర్చాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలని, వారం రోజులకోసారి ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, సీనియర్ నాయకురాలు అత్తి సరోజ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పల్లపు తిరుపతి, ప్రధాన కార్యదర్శి గడ ప రాకేశ్, నాయకులు తోట తిరుపతి, బొ లిశెట్టి రాజన్న, కార్కూరి చంద్రమౌళి, జూ పాక సుధీర్, రవీందర్రావు, శంకర్రావు, షఫియెద్దీన్, గౌసొద్దీన్, మున్సిపల్ ఇంజినీర్ మధుకర్, ఏఈ రాజేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.