రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో ఓ మహిళ దారుణ హత్యకు (Murder) గురైంది. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరుకు చెందిన మోటం సమ్మక్క అనే మహిళ.. భర్త కొన్ని రోజుల క్రిత మరణించాడు. దీంతో ఆమె లక్షింపేట మంటలం దండేపల్లికి చెందిన కనకరాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న సమక్క.. రెండు రోజుల క్రితం కనకరాజుతో కలిసి తన చిన్నాన్న ఇంటికి వెళ్లింది.
మద్యం మత్తులో ఉన్న కనకరాజు, సమక్కకు మధ్య రాత్రి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం ఊగిపోయిన అతడు సమక్క తలపై ఇటుక రాయితో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతించెంది. మృతురాలి బంధువులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేఇస దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి జిల్లా దవాఖానకు తరలించారు. కనకరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.