మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల ( Manchiryala district ) జిల్లా కేంద్రానికి చెందిన అధ్యాపకుడు బంధం బాపురెడ్డి(50) (Lecturer Bapureddy) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. పట్టణంలోని కాలేజీరోడ్డు లో గల గ్రౌండ్లో ఉదయం షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు (Heart attack) రావడంతో కుప్పకూలి మరణించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపురెడ్డి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాపురెడ్డి ముల్కల్ల ఐజా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ హెచ్వోడీగా పని చేస్తున్నారు.