కాసిపేట, ఫిబ్రవరి 16 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి వెళ్లారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజుల పాటు శిక్షణ ఉండనుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు ఎంపీడీవోలను ట్రైనింగ్ కోసం ఎంపిక చేయగా మంచిర్యాల జిల్లా నుంచి కాసిపేట ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ ను శిక్షణకు ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లోని టీపీఎస్ఐపీ, ఆర్డీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆర్డీ కార్యక్రమాల్లో సమృద్ధిగా బ్లాక్‌లు నిర్మించేందుకు, సామర్థ్య అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తి సాఫల్యం సాధించే కార్యక్రమాలపై శిక్షణ పొందనున్నారు.