కాసిపేట, అక్టోబర్ 16 : ప్రపంచ శాంతి కోసమే ఉపవాస దీక్షలుచేపడుతున్నట్లు ప్రముఖ కల్వరీ పాస్టర్ ప్రవీణ్(Pator Praveen) పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్ చేపట్టిన 50 రోజుల ఉపవాస దీక్షల సభ గురువారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి భారీగా క్రైస్తవులు తరలి వచ్చారు. ఉపవాస దీక్ష ముగింపు సందర్భంగా లక్షలాదిగా తరలి వచ్చిన క్రైస్తవులను ఆశీర్వదించారు పాస్టర్.
అనంతరం పాస్టర్ ప్రవీణ్ ప్రసంగిస్తూ.. దేశ శాంతి కోసమే ఉపవాస దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి భేదాభిప్రాయాలు, రాగద్వేషాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలని, మంచి మార్గాలే మనగడకు పునాది అని ఆయన అన్నారు. ముగింపు సభకు జనాలు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులను బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ షారూన్, నిర్వాహకులు శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో హాజరైన క్రైస్తవులు