మంచిర్యాల : ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. చెన్నూరు డివిజన్ ఇరిగేషన్‌శాఖలో ఏఈ (Irrigation AE) గా పనిచేస్తున్న జాడి చేతన్ అనే ఉద్యోగి శుక్రవారం బాధితుడి నుంచి రూ. 5 వేలు లంచం(Bribe) తీసుకుంటుండా ఏసీబీ అధికారులు(ACB) రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
మిషన్ కాకతీయ ఫేజ్ -4లో చేపట్టిన పనులకు ఎంబీ రికార్డు కోసం బొమ్మ చంద్రశేఖర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ ఏఈని సంప్రదించాడు. దీంతో ఏఈ లంచం డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం కార్యాలయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని కెమికల్స్ పూసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరమని తెలిపారు. లంచం తీసుకున్న ఏఈపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.