Palla Rajeshwar Reddy | న్యాయవాదుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
Palla Rajeshwar Reddy | న్యాయవాద దంపతులపై(Lawyers )పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతు తెలుపుతున్నామని జనగామ(Janagama) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy )అన్నారు.
జనగామ : న్యాయవాద దంపతులపై(Lawyers )పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతు తెలుపుతున్నామని జనగామ(Janagama) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy )అన్నారు. శుక్రవారం ఆయన జనగామలో న్యాయవాదుల దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లాయర్స్పై దాడికి పాల్పడిన పోలీసులను బదిలీ చేయడం కాదు, ఉద్యోగాల నుంచి తొలగిం చాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు లంచాలకు మరిగి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు.
ఒక ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే నాలుగు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటే సామాన్య ప్రజలను ఇంకెం తగా వేధిస్తున్నారో తెలుస్తుందన్నారు. దొంగలను, దోపిడీదారులను పట్టుకోమని పోలీసులను పెడితే, పోలీసు లే దొంగలుగా మారి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. న్యాయవాదుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావిస్తానని అడ్వకేట్లకు హామీ ఇచ్చారు. కాగా, జనగామలో న్యాయవాద దంపతులపై పోలీ సుల దాడి ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జనగామ ఇన్స్పెక్టర్ ఎల్. రఘుపతి రెడ్డి, ఎస్ఐ పీ. తిరుపతిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

