నెన్నెల: నెన్నెల మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లంబాడి తండా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు వద్ద వంతెన నిర్మాణం పనులు ఇటీవల చేపట్టారు. దాని పక్కనే తాత్కాలిక రోడ్ వేసి రాకపోకలు సాగించారు.
అయితే భారీ వర్షం పడటం వలన తాత్కాలికంగా వేసిన రోడ్ తెగి పోయింది. దీంతో లంబాడి తండా, కుర్మగూడెం, కోణంపేట, జంగళపేట, ఖర్జీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లపల్లి, మైలరాం, చిత్తపూర్, అవుడం, గంగారాం గ్రామాలలో ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.