తాండూర్ : హిందీ దివస్ (హిందీ దినోత్సవం) ను పురస్కరించుకొని తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ పాఠశాలలో సోమవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ టీచర్ ఎస్ సురేందర్ని ప్రధానోపాధ్యాయురాలు పీ ఉమాదేవి, ఇతర ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ సభ దేవనాగరి లిపిలో హిందీని యూనియన్ అధికారిక భాషగా స్వీకరించడాన్ని గుర్తుచేశారు. రాజ్యాంగ సభ హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తించిందన్నారు.
బియోహర్ రాజేంద్ర సింహా వంటి ప్రముఖ హిందీ పండితులు హిందీని అధికారిక భాషగా చేయాలని గట్టిగా కృషి చేశారని తెలిపారు. భారతదేశ జాతీయోద్యమంలో హిందీ భాష దేశమంతా ఏకతాటిపై నిలపడానికి దోహదపడింది అన్నారు. అప్పటినుంచి హిందీ దివస్ను జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.