కాసిపేట, అక్టోబర్ 15: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు వేస్తారని కాసిపేట మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఈ. సరిత తెలిపారు.
బుధవారం కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో 380 పశువులకు గాలికుంటు టీకాలు వేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సరిత మాట్లాడుతూ ఆవులకు, బర్రెలకు తప్పకుండా టీకాలు వేయించాలని, పాడి రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సంతోష్, గోపాల మిత్ర శ్యాం, శ్రీనివాస్, నారాయణ, నర్సింగ రావు తదితరులు పాల్గొన్నారు.