తాండూర్, సెప్టెంబర్ 9 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ ఏ సాంబమూర్తిని తోటి ఉపాధ్యాయులు మంగళవారం ఘనంగా సన్మానించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించిని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సాంబమూర్తికి పాఠశాల ఆవరణలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మెమొంటోను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో ఎస్ మల్లేశం మాట్లాడుతూ సాంబమూర్తి అందించిన సేవలను ఉన్నతాధికారులు గుర్తించడం హర్షనియమన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు మెరుగైన విద్య బోధన సాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పీ ఉమాదేవి, ఉపాధ్యాయులు రాజేశ్వరరావు, సుధాకర్, శ్రీనివాస్, ప్రసాద్, భాస్కర్, అంజిరెడ్డి, సురేందర్, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.