హైదరాబాద్ : క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై(Kyathanpally Municipality) గులాబీ జెండా ఎగరడంఖాయం అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి(Kyathannapalli) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కుట్రల రాజకీయాలకు వ్యతిరేఖంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాల్క సుమన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే విధంగా మంత్రి, కాంగ్రెస్ నాయకులలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎవరి ఎన్ని కుట్రలు చేసినా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండాను ఎగురవేస్తామని తేల్చిచెప్పారు.