తాండూర్, డిసెంబర్ 5: మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిసృజన్ గౌడ్ పై దాడి చేసి గాయపరిచిన కేసులో కాయిత శ్రీనిఖిల్ అనే యువకుడ్ని అరెస్టు చేశామని తాండూర్ ఎస్ఐ డీ కిరణ్ కుమార్ తెలిపారు.
తాండూర్ ఐబీలో జరిగిన గొడవలో పూర్తిస్థాయిలో విచారించి సృజన్ గౌడ్ ఫిర్యాదు మేరకు నిఖిల్ ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నేటితరం యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. శ్రీనిఖిల్ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు.