గురుకులాల్లో ఐదో తరగతిలో ఖాళీలు
మూడు కేంద్రాల్లో 1353 మంది హాజరు
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులకు అనుమతి
మంచిర్యాల అర్బన్, జూలై 18 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆది వారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో 400 మంది విద్యార్థులకు 354 మంది హాజరు కాగా, 46 మంది గైర్హాజరయ్యారు. కొవిడ్ నేపథ్యంలో అధికారులు విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్‌తో పరీక్షించి లోనికి అనుమతించారు.
బెల్లంపల్లిలో 774 మంది హాజరు..
బెల్లంపల్లిరూరల్, జూలై 18: ఏఆర్ హెడ్‌క్వార్టర్ పక్కనున్న బాలికలు, శివాలయం వద్ద గల కాసిపేట బాలుర గురుకుల కళాశాలల్లో 912 మంది విద్యార్థులకు 774 మంది హాజరయ్యారు. 138 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. కాసిపేట బాలుర కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బెల్లంపల్లి బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ స్వరూప చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు.
రామృకృష్ణాపూర్ 225 మంది..
రామకృష్ణాపూర్, జూలై18: రామకృష్ణాపూర్ కేంద్రంలో కు మ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 273 మంది విద్యార్థులకు 225 మంది పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్ -19 నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహించామని గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తిరుమల తెలిపారు.