మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 8 : పోలీస్ ఉద్యోగం అనేక సవాళ్లతో కూడుకున్నదని, సమర్థవంతంగా ఎదురొని ముందుకెళ్లాలని మంచిర్యాల డీసీపీ భాసర్ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో మంచిర్యాల టచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పోలీసులకు కార్డియాలజీ స్రీనింగ్కు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ సీఐ ప్రమోద్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీపీ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన పోలీస్ సిబ్బంది గురించి వివరించారు.
ప్రతి ఉద్యోగంలో ఒత్తిడిలు ఉంటాయని, పోలీస్ ఉద్యోగంలో అవి సహజమని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఇటీవల ఎస్ఐగా విరమణ పొందిన రాములు అందించిన సేవలను అభినందించారు. ఈ శిబిరంలో ప్రతి రోజూ 20 మందికి చొప్పున దాదాపు 500 మందికి వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం టచ్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణుడు రాజేశ్ బురండే గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వికాస్, తిరుమల్‌రావు, సీఈవో రాజ్ పాల్, మేనేజింగ్ డైరెక్టర్ మాటెటి శ్రీనివాస్, డైరెక్టర్లు శేఖర్, జాన్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.