మంచిర్యాలటౌన్, మార్చి 29 : 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌ను రూ. 66.33 కోట్లుగా రూపొందించారు. ఆదాయం రాబడి, ఖర్చులను సమానంగా చూపించారు. కార్పొరేషన్ స్పెషలాఫీసర్, కలెక్టర్ కుమార్‌దీపక్, కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదించారు.
అనంతరం బడ్జెట్ వివరాలను డీఎంఏ కార్యాలయానికి పంపించారు. కార్పొరేషన్‌కు ఆదాయ వనరుల్లో పన్నుల రూపేణా రూ. 2073.7 లక్షలు, అసైన్డ్ రెవెన్యూ రూపేణా రూ. 452 లక్షలు, రెంటల్ ఆదాయం రూ. 370.95 లక్షలు, పబ్లిక్‌హెల్త్, శానిటేషన్ విభాగంనుంచి రూ. 172 లక్షలు, టౌన్ప్లానింట్ విభాగం నుంచి 1244.80 లక్షలు, ఇంజినీరింగ్ విభాగంనుంచి రూ. 362 లక్షలు, గ్రాంట్లలో నాన్‌ప్లాన్ గ్రాంట్ల కింద రూ. 1123.72 లక్షలు, ప్లాన్ గ్రాంట్ల కింద రూ. 100 లక్షలు, ఇతర గ్రాంట్ల నుంచి రూ. 627.50 లక్షలు వస్తాయని అంచనాలు తయారు చేశారు.
ఖర్చులకు సంబంధించిన పద్దుల్లో అధికారులు, సిబ్బంది జీతాలకు రూ. 1585.8 లక్షలు, పారిశుధ్యనిర్వహణకు రూ. 716.2లక్షలు, విద్యుత్ చార్జీలకు రూ. 62 లక్షలు, పదిశాతం గ్రీన్ బడ్జెట్‌కు రూ. 467.56 లక్షలు, ఇంజినీరింగ్ విభాగానికి రూ. 756.45 లక్షలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి రూ. 304.85 లక్షలు, టౌన్‌ప్లానింగ్ విభాగానికి రూ. 30 లక్షలు, 1/3 బ్యాలెన్స్ బడ్జెట్ ఎక్సెండిచర్ రూ. 250.93 లక్షలు, పబ్లిక్ ఎమినిటీస్ ఖర్చు రూ. 30.30 లక్షలు, వార్డుల వారీగా పనులు చేపట్టడం కోసం రూ. 471.56 లక్షలు, రుణాలు, డిపాజిట్లకు రూ. 36 లక్షలు, క్యాపిటల్ ప్రాజెక్టుఫండ్స్ రూ. 1921.22 లక్షలు కలిపి మొత్తం రూ. 66.33 కోట్లు ఖర్చు అవుతాయని బడ్జెట్ అంచనాల్లో చూపించారు.