జన్నారం/లక్షెట్టిపేట/మందమర్రి/మంచిర్యాల అర్బన్/కాసిపేట, డిసెంబర్ 20 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడంపై పలు సంఘాల నాయకులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అమిత్‌షా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. జన్నారంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో అమిత్ షా ఫ్లెక్సీని దహనం చేశారు.
నాయకులు మహ్మద్ రియాజొద్దీన్, సయ్యద్ ఫసిఉల్లా, షాదుపాష, ముత్యం రాజన్న, రమేశ్, ప్రవీణ్, రాజేశ్, ఇమ్రాన్, మోసిన్ పాల్గొన్నారు. లక్షెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు పాలాభిషేకం చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు మండల అధ్యక్షుడు గరిసె రవీందర్ మాట్లాడుతూ అమిత్‌షా బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కించపరిచేలా మాట్లాడారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నాయకులు పెండెం రాజన్న, బైరం లింగన్న, దొత నర్సయ్య, మేకల ప్రేంసాగర్, బైరం రవి, మినుముల శాంతికుమార్, గుత్తికొండ శ్రీధర్, ప్రేమ్‌సాగర్, నరేశ్, తొగరి రాజు, రమేశ్, విజయ్, రాజారావు, రాజశేఖర్, రాజేందర్, ప్రవీణ్ ఉన్నారు. మందమర్రిలోని సింగరేణి పాఠశాల సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దిష్టి బొమ్మను దహనం చేశారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేదర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
కాసిపేటలో మాల మహానాడు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాసు సుధాకర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో దళిత నాయకులు అమిత్ షా దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత నాయకులు కొండా రాంప్రసాద్, బూస సారయ్య, దుర్గం తిరుపతి, మన్నెంపల్లి మల్లేశ్, కేశవ్, కుమ్మరి పోషన్న, దుర్గం రవి, వాసుదేవ్ పాల్గొన్నారు.