రైతన్న కష్టం బుగ్గిపాలు
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె), ధార్కుభీర్, నిగ్వ గ్రామాల్లో కోతకోసి కుప్పలు పోసి నూర్పిడి చేస్తే చేతికొచ్చే మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ వల్ల గురువారం 21 మంది రైతులకు చెందిన మొక్కజొన్న 43 ఎకరాల్లో కాలిబూడిదైంది.
- పార్డి(కె), ధార్కుభీర్, నిగ్వ గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు
- 43 ఎకరాలు.. సుమారు రూ.27 లక్షల నష్టం
కుభీర్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె), ధార్కుభీర్, నిగ్వ గ్రామాల్లో కోతకోసి కుప్పలు పోసి నూర్పిడి చేస్తే చేతికొచ్చే మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ వల్ల గురువారం 21 మంది రైతులకు చెందిన మొక్కజొన్న 43 ఎకరాల్లో కాలిబూడిదైంది. ఎండ తీవ్రతతోపాటు బలమైన గా లులు వీస్తుండడంతో ఒకరి చేను నుంచి మరొకరి చే నుకు మంటకు వ్యాపించాయి. పార్డి(కె)లో కొరండ్ల నర్సయ్య, కొరండ్ల ఓం ప్రకాశ్, మెంచు పోశెట్టి, శీలేవార్ తిరుపతి, మహబూబ్, తిర్మన్పెల్లి సంబాజీ, అహ్మద్, యాసిన్, నిగ్వలో దొంతుల భోజన్నలకు చెందిన మక్క పంటలు దగ్ధమయ్యాయి.
ధార్ కుభీర్లోని ఏడుగురు రైతులకు చెందిన 15.20 ఎకరాల్లోని పంట కాలి బూడిదైంది. అగ్ని మాపక శకటం భైంసా నుంచి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చా రు. మొత్తం ఆస్తి నష్టం రూ.26.72 లక్షలుగా అంచ నా వేసినట్లు ఎమ్మారై నరేశ్ తెలిపారు. సర్పంచులు బందెల సత్యనారాయణ, తోకల మారుతి, ఎస్సై శ్రీనివాస్, ఏఈవో నారాయణ చేలను పరిశీలించారు.
తరోడా గ్రామంలో..
ముథోల్, ఏప్రిల్ 30 : తరోడా గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 12 ఎకరాల మొక్కజొన్న దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. చేతికొచ్చిన ఐదెకరాలు, నిజామొద్దీన్ 3, సికిందర్ ఖాన్ 2, ఏయఖాన్ 2 ఎకరాల పంట కాలిబూడిదైనట్లు వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

