ఎదులాపురం, జూలై 4 : ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ రిటర్న్స్ పేరిట ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడిన యూనిక్ ఎస్ఎంసీఎస్ కంపెనీ ప్రధాన నిర్వాహకుడు కొణతాల చంద్రశేఖర్‌ను జైనథ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, పదేళ్ల తర్వాత రెట్టింపు మొత్తాన్ని ఇస్తామని నమ్మబలికి మోసం చేసినట్లు గుర్తించారు.
జిల్లాలో ఈ సంస్థపై ఇప్పటివరకు ఆరు కేసులు నమోదవగా, 40 మంది బాధితులు సుమారు రూ.19 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జైనథ్ సీఐ జి.శ్రావణ్, ఎస్సై పి.గౌతమ్ పాల్గొన్నారు.