ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూన్ 19 : ఆసిఫాబాద్ పట్టణంలోని సాయినగర్, రాజంపేట ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఓ పిచ్చికుక్క ముగ్గురు చిన్నారులపై దాడి చేసింది. ఆరు బయట ఆడుకుం టుండగా ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
స్వల్పంగా గాయపడ్డ ఒకరిని స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మంచిర్యాలలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కుక్కల దాడులు ఎక్కువయ్యాయని, బయటకు వెళ్లాలంటే జంకుతున్నామని, ఇకనైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.