తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా (Lorry Overturn ) పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి నష్టం జరుగలేదని పోలీసులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్లోని మాచర్ల నుంచి చత్తీస్గఢ్ రాష్ట్రం జబల్పూర్కు వెళ్తున్న కందిపప్పు లారీ డ్రైవర్ తాండూర్ పెట్రోల్ బంక్ సమీపం హోటల్ వద్ద భోజనానికి ఆపుతున్న క్రమంలో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది.
విషయం తెలుసుకున్న తాండూరు ఎస్సై కిరణ్కుమార్ , పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.