వైభవంగా అయ్యప్ప దీపాయాత్ర
అయ్యప్ప దీక్షాపరుల ఆధ్వర్యంలో కాగజ్నగర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన మహిళల దీపాయాత్ర వైభవంగా సాగింది. స్థానిక రాంమందిర్లో గురుస్వాములు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర వాహనానికి కోనేరు కృష్ణారావు, డీఎస్పీ కరుణాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, పట్టణ ఏహెచ్వో రవీందర్ ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభించారు
కాగజ్నగర్టౌన్, డిసెంబర్ 26 : అయ్యప్ప దీక్షాపరుల ఆధ్వర్యంలో కాగజ్నగర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన మహిళల దీపాయాత్ర వైభవంగా సాగింది. స్థానిక రాంమందిర్లో గురుస్వాములు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర వాహనానికి కోనేరు కృష్ణారావు, డీఎస్పీ కరుణాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, పట్టణ ఏహెచ్వో రవీందర్ ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభించారు.
సర్సిల్క్ రాంమందిర్ నుంచి ప్రారంభమైన దీపాయాత్ర హనుమాన్ మందిర్, రాజీవ్గాంధీ చౌరస్తా, ప్రధాన మార్కెట్ వీధుల గుండా న్యూ కాలనీలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకున్నది. అయ్యప్ప గుడిలో మహా హారతి, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీపాయాత్రలో అయ్యప్ప గురుస్వాములు, కన్నెస్వాములు, పలువురు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మహిళలు దీపాలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పట్టణ ఏహెచ్వో రవీందర్, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసు బందోబస్తు నిర్వహించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

