లక్షెట్టిపేట, డిసెంబర్ 7 : నిరుపేద విద్యార్థులు చదువుకునే గురుకులాలపై సర్కారు కు చిన్నచూపెందుకని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు విజిత్‌రావు ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలను నాయకులతో కలిసి సం దర్శించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మహాత్మా జ్యోతిబాఫూలే, గురుకు లం, మోడల్ డిగ్రీ కళాశాల, కస్తూర్బా గాం ధీ పాఠశాలలకు పక్కా భవనాలు మంజూ రు చేయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలు పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంతకు ముందు వసతిగృహాన్ని కలియదిరిగారు. కిచన్లో వంటకు ఉపయోగించే సామగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ చాతరాజు రాజన్న, పెట్టెం తిరుపతి, మెట్టు రాజు, షాబొద్దీన్, సుమన్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.
ఇట్లాంటి భోజనం పెడతారా?
చెన్నూర్, డిసెంబర్ 7 : ‘అన్నం సరిగా ఉడక లేదు. కూర.. సాంబారు నీళ్లలాగా ఉంది. పిల్లలకు పెట్టేది ఇట్లాంటి భోజనమేనా’ అంటూ బీఆర్ఎస్ నాయకులు మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. శనివారం చెన్నూర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలై బీసీ (బాలుర) గురుకులానికి వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. రుచి చూసి నాణ్యతగా లేకపోవడంపై ప్రిన్సిపాల్ కేవీఎం ప్రకాశ్‌రావును ప్రశ్నించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కోరారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గ స్థాయి నాయకుడు రాజా రమేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ఫాయిజన్‌తో 48 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు.
ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్ చెలిమల చైతన్య, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శరత్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కోటపల్లి సింగిల్ విండో చైర్మన్ సాంబాగౌడ్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, కో-ఆప్షన్ సభ్యుడు ఆయూబ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, నాయకులు మేడ సురేశ్‌రెడ్డి, నాయిని సతీశ్‌రాజ్, మల్లేశ్, ఈర్ల మల్లికార్జున్, పాసం ఆశీష్, భారతి, బడికెల శ్రావణ్, నాయబ్, ఎనగందుల ప్రశాంత్, అన్వర్, మల్లేశ్, విజయ్, నెన్నల భీమయ్య పాల్గొన్నారు.