బోథ్, ఏప్రిల్ 30 : బోథ్ అటవీ రేంజ్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కైలాస్ టేకిడి అటవీ ప్రాంతంలో గురువారం పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. అటు వైపుగా వెళ్తున్న కొంతమంది పులి రోడ్డు దాటుతుండగా గమనించారు.
వారు ప్రయాణిస్తున్న కారును ఆపి పులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. పెద్ద పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.