వాషింగ్టన్: ఇరాన్‌తో హొర్ముజ్ జలసంధి తెరిచే అంశంతోపాటు పలు అంశాలపై తమ పరిపాలనా యంత్రాంగం జరుపుతున్న చర్చలకు ఆడ్డొస్తే ఒమన్‌పై బాంబులు వేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినట్లు ఫాక్స్ న్యూస్ సోమవారం వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడం కోసం అమెరికా, ఒమన్‌లు వేర్వేరుగా ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ఈ జలసంధి గత ఆరు నెలలుగా మూసివేసి ఉంది. ఫోన్ ఇంటర్వ్యూ సమయంలో ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒమన్‌ను తిడుతూ ఈ హెచ్చరికలు చేశారని ఒక ఫాక్స్ రిపోర్టర్ తెలిపారు. అంతకుముందు రోజు ఒమన్‌తో ఒప్పందాన్ని ఖరారు చేసే దశకు చేరుకున్నామని ఇరాన్ అధికారులు తెలిపారు. మరో వైపు అమెరికా-ఇరాన్ చర్చల సంగతి అగమ్యగోచరంగా మారింది.