న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోమవారం తాను పార్టీలోని అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అత్యవసర, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా బీజేపీలోని అన్ని పదవులకు జూలై 30నే తాను రాజీనామా చేశానని తెలియజేస్తూ, తన రాజీనామా లేఖను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. అయితే పార్టీ తన రాజీనామాను వెంటనే ఆమోదించేందుకు ఇష్టపడలేదని,పూనావాలా పేర్కొన్నారు.