జై నూర్ : ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండల కేంద్రానికి చెందిన లిటిల్ స్టార్( Little Star) ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan ) రాష్ట్రస్థాయి అవార్డు( Award) లభించిందని ఆ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ అసిఫ్ తెలిపారు. రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన ఎడ్యుటెక్ ఎక్స్‌ప్రో కార్యక్రమం శనివారం నీయో మందిరంలో జరిగింది.
తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల నిర్వహణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన పాఠశాలలకు సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడం, విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.