కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ) : ఆరోగ్యాన్ని అందించే పాల కంటే.. ఆరోగ్యానికి హానికరమైన మద్యాన్ని తాగడానికే జిల్లావాసులు మొగ్గు చూపుతున్నారు. పౌష్టికాహారమైన పాలని రోజు తాగితే ఆరోగ్యానికి మంచిదని తెలిసినా తాగేందుకు ఇష్టపడడం లేదు. మద్యం ఆరోగ్యానికి హానికరమని, ప్రాణాంతకమని తెలిసినా తాగేస్తున్నారు. మద్యానికి దూరంగా ఉండాలని వైద్యులు, ఆరోగ్యాన్ని గురించి తెలియజేసే మేధావులు ఇచ్చే సలహాలను ఎవరు పట్టించుకోవడం లేదు. పాలు తాగడం కంటే లిక్కర్ తాగడంపైనే ఆసక్తి చూపుతున్నారు. గ్లాసెడు పాలు కొనుక్కుని తాగటానికి ఆసక్తి చూపని వాళ్లు.. వందల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగేస్తున్నారు. జిల్లాలో జరిగే మద్యం సేల్స్ దిమ్మతిరిగిపోతోంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పాలు, టీ, కాఫీ, చాయ్ రూపంలో ప్రజలు రోజు 24 నుంచి 25 వేల లీటర్ల పాలు తాగుతున్నారు. కాగా.. జిల్లాలో రోజుకు మద్యం దాదాపు 1000 నుంచి 1200 కేసులు, బీర్లు 1200 కే సులు అమ్ముడు పోతున్నాయి. అంటే రోజుకు 24-30 వేల లీటర్ల మద్యాన్ని మందుబాబు లు తాగేస్తున్నారు. కాగా.. జిల్లాలోని కిరాణా దుకాణాల్లో పాలు దొరకవుగాని, మద్యం బా టిళ్లు మాత్రం తప్పకుండా దొరుకుతున్నాయి. గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టుషాపులు ఉండడంతో అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నా యి.
బెల్టుషాపుల వల్ల వయస్సు మళ్లిన వారితోపాటు యువత కూడా మద్యానికి బానిసలవుతున్నారు. తాగేందుకు పాలు, మంచినీళ్లు దొరకని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం విక్రయాలపై ఆంక్షలు లేకపోవడంతో పాలకంటే మద్యం అధికంగా అమ్ముడవుతున్నది. ప్రభుత్వానికి మద్యం సేల్స్‌పై వచ్చే ఆదాయమే ప్రధానం కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ స్తున్నాయి. చదువుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన యువత మద్యానికి బానిసలు అవుతున్నారు. వైన్స్‌ల్లో కంటే గ్రా మాల్లో ఉన్న బెల్టుషాపుల్లోనే మద్యం ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి.