తాండూర్ : గ్రంథాలయాలు ( Library ) విజ్ఞాన బండాగారాలని, విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని పాఠకులు అన్నారు. గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా తాండూర్ ( Tandoor ) శాఖ గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన, ఉత్తమ పాఠకులకు సన్మానాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సమాయాత్తమవుతున్న వారందరూ కూడా గ్రంథాలయాన్ని వినియోగించు కోవాలని కోరారు. ఈ సందర్బంగా ఉత్తమ పాఠకులైన దండ నాయకుల రవిశంకర్, రేవెల్లి చంద్రశేఖర్ సన్మానించారు.